‘మోదీ కిటికీలు తెరిస్తే కేసీఆర్‌ ద్వారాలే తెరిచారు’

తాజా వార్తలు

Published : 07/05/2020 02:05 IST

‘మోదీ కిటికీలు తెరిస్తే కేసీఆర్‌ ద్వారాలే తెరిచారు’

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి 


హైదరాబాద్: ప్రభుత్వానికి ఆదాయం మీద ఉన్న ఆసక్తి ప్రజల యోగక్షేమాలపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచితే లాక్‌డౌన్‌ ఉన్నా ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఒక చేత్తో డబ్బులు ఇచ్చి.. మద్యం అమ్మకాల ద్వారా మరో చేత్తో వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్షాలను కించపరచడం మంచి పద్దతి కాదని చాడ హితవు పలికారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయని.. ప్రజల ఆవేదనను తమ గొంతు ద్వారా వినిపిస్తాయని అన్నారు. కరోనా పట్ల ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రధాన మంత్రి కొంత వెసులుబాటుతో కిటికీలు తెరిస్తే ముఖ్యమంత్రి ద్వారాలనే తెరిచారని వ్యాఖ్యానించారు. రైతులకు రూ.25వేల వరకు ఉన్న రుణమాఫీకి తక్షణమే నిధులు విడుదల చేస్తామని చెప్పడం మంచి పరిణామమని చాడ అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని