ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి: లోకేశ్‌
close

తాజా వార్తలు

Updated : 21/06/2021 14:36 IST

ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి: లోకేశ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు జాబ్‌ రెడ్డిగా.. ఆ తర్వాత డాబు రెడ్డిగా మారారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఇటీవల జగన్‌ విడుదల చేసింది జాబ్‌ క్యాలెండర్‌ కాదని.. డాబు క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గ్రూప్‌-1 పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై అభ్యర్థులతో లోకేశ్‌ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

‘‘అభ్యర్థులు మొదటి విజయం సాధించారు. మొయిన్స్‌ జవాబు పత్రాలను మాన్యువల్‌ వాల్యుయేషన్‌ చేయాలి. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, మార్కులు, జవాబు పత్రాలను వెల్లడించాలి. ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జవాబు పత్రాలను విడుదల చేయాలి. ఎంపిక ప్రక్రియ, వాల్యుయేషన్‌పై అనుమానాలున్న వారి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్‌లైన్‌ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతకు తెదేపా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా లోకేశ్‌ ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని