Raghurama: పొరపాటా?కావాలనేనా?: రఘురామ
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 12:10 IST

Raghurama: పొరపాటా?కావాలనేనా?: రఘురామ

పేరు తొలగింపుపై స్పష్టత ఇవ్వండి

వైకాపా అధినేత, సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాసిన ఎంపీ

అమ‌రావ‌తి: వైకాపా అధికారిక‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి తన పేరును తొల‌గించ‌డంపై రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. వైకాపా త‌ర‌ఫున గెలిచిన త‌న పేరును తొలగించ‌డంపై అందులో ప్ర‌స్తావించారు. వైకాపా నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించారా? అని ఎంపీ సందేహం వ్య‌క్తం చేశారు. పొర‌పాటున‌ పేరు తొల‌గించారా? లేక కావాల‌నే చేశారా? అనే విష‌యంపై స్పష్టత ఇవ్వాలని జ‌గ‌న్‌ను కోరారు.

కావాల‌నే త‌న పేరును వైకాపా వెబ్‌సైట్ నుంచి తొల‌గించిన‌ట్ల‌యితే పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన‌ట్లు భావిస్తానని.. 48 గంట‌ల్లో పేరు చేర్చ‌క‌పోతే పార్ల‌మెంట్ సెక్ర‌టేరియ‌ట్ దృష్టికి తీసుకెళ‌తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో త‌నును తాను స్వతంత్ర అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకోవాల్సి వ‌స్తుంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

రాజ్యసభ, లోక్‌సభకు కలిపి వైకాపా తరఫున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్‌సైట్‌లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే గెలిచిన గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు పేరు ఇప్పుడు జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు లేఖ రాశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని