అది ‘డాబు క్యాలెండర్‌’: లోకేశ్‌
close

తాజా వార్తలు

Published : 18/06/2021 17:56 IST

అది ‘డాబు క్యాలెండర్‌’: లోకేశ్‌

అమరావతి: సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌ .. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని 54వేల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చినట్టు మోసపు ప్రకటన ఇచ్చారని ఆక్షేపించారు.

 వైకాపా కార్యకర్తలకు వాలంటీర్లు, వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు వేసుకుని ఉద్యోగాలు ఇచ్చినట్టు హడావుడి చేస్తున్నారని విమర్శించారు.  దొంగ ఓట్లు వేయించే వైకాపా కార్యకర్తల్ని వాలంటీర్లుగా నియమించటం వివక్ష లేకపోవడమా అని ప్రశ్నించారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగ భర్తీ పరీక్ష పేపరు అమ్మేయడం అవినీతికి తావులేకుండా భర్తీ చేసినట్టా అని లోకేశ్‌ నిలదీశారు. ఉద్యోగాలు అమ్ముకోవడం మీ భాషలో అత్యంత పారదర్శకతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా జనవరి 1న జాబు క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చి, రెండేళ్ల తరువాత తప్పుడు లెక్కలతో విడుదల చేసి, మడమ తిప్పడంలో తనకు ఎవరూ సాటిలేరని జగన్‌ నిరూపించుకున్నారని లోకేశ్‌ విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని