
తాజా వార్తలు
మేనిఫెస్టో చూసి ఓటేయండి: లోకేశ్
విశాఖపట్నం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విశాఖ గాజువాక నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నగరానికి చేరుకున్న లోకేశ్‌కు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. తొలుత సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం గాజువాకలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొ్ని ప్రజలకు అభివాదం చేశారు. తెదేపా మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఓటేయాలని కోరారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖలో కనీసం ఒక రోడ్డైనా వేశారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ హయాంలో విశాఖకు తీసుకొచ్చిన మెడ్‌టెక్ పార్క్ లాంటి పరిశ్రమలు కరోనా సంక్షోభ సమయంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి చాటాయన్నారు. జిల్లావ్యాప్తంగా 73వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. విశాఖ మేయర్ పీఠం తమదేనని స్పష్టం చేశారు. తెదేపా నేతలు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
Tags :