అవినీతి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: రేవంత్‌రెడ్డి 

తాజా వార్తలు

Published : 23/08/2020 02:34 IST

అవినీతి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం: రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్‌: కీసర తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్‌హెడ్స్‌ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు. తన లెటర్‌హెడ్స్‌ లభించడంపై తప్పేముందన్న రేవంత్‌రెడ్డి.. అందులో ఉన్న సమాచారానికి, కీసర వ్యవహారానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. జరిగిన వ్యవహారంలో ఒక్క పైసా సంబంధమున్న శిక్షకు సిద్ధమని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని