గవర్నర్‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 23/07/2020 02:14 IST

గవర్నర్‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔనత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకమని ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డను కొనసాగించాలని గవర్నర్‌ చెప్పడం ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచిందన్నారు. అధికారం ఉందని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదని చెప్పారు. 

కొవిడ్‌ ఐసోలేషన్‌లో దారుణ పరిస్థితులు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గర్భిణీ నేలపై పడి చనిపోయి మూడు గంటలు దాటినా ఎవరూ స్పందించలేదన్నారు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించారని చెప్పారు. ఆ దృశ్యాలు ఎంతో కలిచివేశాయంటూ వీడియోను చంద్రబాబు ట్విటర్‌లో పెట్టారు. తోటి రోగులు బాధపడుతూ ఈ వీడియో పెట్టారని, గర్భిణీకి సహాయం చేయడానికి సిబ్బంది రాలేదని చెప్పినట్లు పేర్కొన్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని