ఓటుకు నోటు కేసు.. రేవంత్‌ డ్రైవర్‌, పీఏపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

తాజా వార్తలు

Updated : 30/07/2021 05:50 IST

ఓటుకు నోటు కేసు.. రేవంత్‌ డ్రైవర్‌, పీఏపై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి డ్రైవర్‌, పీఏపై అనిశా ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సాక్షులుగా విచారణకు హాజరుకావాలని ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్‌ రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఆయన డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు సైదయ్యకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సమన్లు తీసుకున్నప్పటికీ ఇవాళ విచారణకు గైర్హాజరు కావడంతో ఇద్దరికీ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన అనిశా కోర్టు... ఆగస్టు 9న హాజరుకావాలని స్పష్టం చేసింది. నిందితుల్లో ఉదయ్‌సింహా ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు తదుపరి విచారణను అనిశా కోర్టు రేపటికి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని