Eatala Rajendar: కేసీఆర్‌ ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు: ఈటల

తాజా వార్తలు

Updated : 25/08/2021 15:51 IST

Eatala Rajendar: కేసీఆర్‌ ఎన్ని చేసినా ప్రజలు నమ్మరు: ఈటల

జమ్మికుంట: ప్రజలపై ప్రేమతో కాకుండా దళితుల ఓట్ల కోసమే ‘దళితబంధు’ కార్యక్రమాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. తన రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డులు వస్తున్నాయన్నారు. జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. హుజూరాబాద్‌ ప్రజలకు ఇచ్చే వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వం ఇచ్చే దళితబంధు, పింఛను, రేషన్‌కార్డులు తీసుకుని ఓటు మాత్రం ఈటలకే వేస్తామని హుజూరాబాద్‌ ప్రజలు అంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోందన్నారు. నియోజకవర్గంలో రూ.వందలకోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా తెరాస ఓటమి నిర్ణయమైపోయిందన్నారు.  సీఎం కేసీఆర్‌ ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే దళితబంధు పెట్టారని ప్రజలకూ తెలుసన్నారు. తన డిమాండ్ల ఫలితంగానే దళిత అధికారులకు మంచి పోస్టింగులు ఇచ్చారని.. రాజీనామాతో హుజూరాబాద్‌ ప్రజలకు లాభం కలిగిందని ఈటల అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని