Chandrababu: హద్దులు దాటితే నియంత్రణ కష్టం: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 20/10/2021 01:05 IST

Chandrababu: హద్దులు దాటితే నియంత్రణ కష్టం: చంద్రబాబు

విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై మంగళవారం సాయంత్రం వైకాపా శ్రేణులు దాడిచేసి వాహనాలు, ఇంట్లోని ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పట్టాభి నివాసాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీనేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్‌, వంగవీటి రాధాతో కలిసి పరిశీలించారు. ధ్వంసమైన సామగ్రిని పరిశీలించి, దాడి ఘటనపై పట్టాభి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..‘‘ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. గంజాయి సాగు ఎవరు చేస్తున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారు? సాక్ష్యాధారాలు మేం ఇస్తామా? దర్యాప్తు చేసే బాధ్యత పోలీసులదా? మాదా? తెదేపా నేతలు బరితెగిస్తే పోలీసులు పారిపోవడం ఖాయం. దాడులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలి. డీజీపీ కార్యాలయానికి మా కార్యాలయానికి ఎంత దూరం? పోలీసులు, ప్రభుత్వం కలిసే దాడులు చేయించారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని