Ap News: రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకే దిల్లీకి చంద్రబాబు: వైకాపా ఎంపీ భరత్‌

తాజా వార్తలు

Published : 25/10/2021 16:19 IST

Ap News: రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకే దిల్లీకి చంద్రబాబు: వైకాపా ఎంపీ భరత్‌

అమరావతి: స్వప్రయోజనాల కోసమే తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిశారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ ఆరోపించారు. సోమవారం రాజమహేంద్రవరంలో భరత్‌ మీడియాతో మాట్లాడారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే చంద్రబాబు ఇలా చేశారని విమర్శించారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర పరువును దిగజార్చారని భరత్‌ మండిపడ్డారు. తెదేపా పాలనలో విశాఖలో గంజాయి పెరిగిందని గంటా చెప్పారన్నారు. డ్రగ్స్‌ అంశంలో గుజరాత్‌, మహారాష్ట్రను విమర్శించే ధైర్యం చంద్రబాబుకు లేదని.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకే దిల్లీ వెళ్లారని భరత్‌ మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని