AP News: తాడేపల్లికి చేరిన ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి పంచాయితీ

తాజా వార్తలు

Updated : 28/09/2021 13:03 IST

AP News: తాడేపల్లికి చేరిన ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి పంచాయితీ

అమరావతి: రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పంచాయితీ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. నేతలిద్దరూ సీఎంను కలిసేందుకు తాడేపల్లికి వచ్చారు. వీరిద్దరూ ఇటీవల బహిరంగంగా పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ పిలిచి వివరణ తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పర్యవేక్షకుడు వై.వి.సుబ్బారెడ్డిని జగన్‌ ఆదేశించారు. దీంతో ఆయన వారిని తాడేపల్లికి పిలిపించి భేటీ అయ్యారు. ఇరువురి మధ్య వివాదానికి కారణాలు తెలుసుకుంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. అవసరమైతే ఇరువురు నేతలతో జగన్‌ కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. 

పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉండగా.. కొందరు రైతులతో రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాలు తెరిపించి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడే ప్రయత్నాలు చేశారని ఎంపీ భరత్‌పై జక్కంపూడి రాజా ఇటీవల పరోక్ష విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసుని తనపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా స్పందించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని