AP News: తెదేపాకు పోటీగా... వైకాపా జనాగ్రహ దీక్షలు

తాజా వార్తలు

Published : 20/10/2021 20:23 IST

AP News: తెదేపాకు పోటీగా... వైకాపా జనాగ్రహ దీక్షలు

అమరావతి: తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా ‘‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’’ పేరుతో తెదేపా అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టనున్నారు. రేపు ఉదయం నుంచి 36 గంటల పాటు దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు. చంద్రబాబు దీక్షకు పోటీగా వైకాపా కూడా నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. తెదేపా నేతల అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్టు  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌ తో రేపు, ఎల్లుండి  దీక్షలు కొనసాగుతాయన్నారు. తెదేపా , వైకాపా పోటా పోటీ ఆందోళనతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఇవాళ తెదేపా బంద్‌కు పిలుపునిస్తే.. అందుకు పోటీగా వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని