పల్లె పోరులో యువ తారలు

తాజా వార్తలు

Published : 16/02/2021 16:42 IST

పల్లె పోరులో యువ తారలు

అభివృద్ధే ధ్యేయమంటున్న యువతరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంచాయతీల్లో ఎన్నికల్లో పోటీకి యువతరం ముందుకొస్తోంది. ఇంజినీరింగ్‌ వంటి సాంకేతిక విద్యతోపాటు సీఏ వంటి వృత్తిపరమైన కోర్సులు చదువుతున్నవారు సైతం ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సరికొత్త ఆలోచనలతో ఉత్తమ పరిపాలనే ధ్యేయంగా పల్లెపోరులో యువతరం పోటీ పడుతోంది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు సర్పంచిగా గిరిజ పోటీ చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన గిరిజ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు నెల రోజుల క్రితమే బాపట్లకు చెందిన యువకుడితో వివాహం జరిగింది. గిరిజ స్వగ్రామమైన అందుకూరులో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు కావడంతో గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు. భర్తతోపాటు అత్తింటివారు కూడా ఆమెను పోటీ చేయించేందుకు అంగీకరించారు. గిరిజ పోటీపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు. ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.

పెదకూరపాడులో సీఏ విద్యార్థిని సాజీదా వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీకి దిగారు. ప్రజా జీవితంతోకి రావాలనుకునేవారికి పంచాయతీ ఎన్నికలే తొలి మెట్టు అని సాజీదా అంటున్నారు. రోజూ కొంత సమయం ఆన్‌లైన్‌లో సీఏ పాఠాలు వింటూ మిగతా సమయంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సాజీదా అశాభావం వ్యక్తం చేశారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని