రఘురామపై అనర్హత వేటు వేయండి: వైకాపా
close

తాజా వార్తలు

Published : 24/06/2021 00:50 IST

రఘురామపై అనర్హత వేటు వేయండి: వైకాపా

దిల్లీ: వైకాపాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్‌ కొనసాగుతోంది. స్వపక్షంలో విపక్షంలా తయారైన రఘురామపై అనర్హత వేటు వేయాలని వైకాపా నేతలు గతంలోనే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై తాజాగా మరోసారి వైకాపా నేతలు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని గతేడాది జులై 3న ఫిర్యాదు చేశామని, అనర్హత వేటులో అకారణంగా జాప్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేశామని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అనర్హత వేటు వేయకపోవడం దురదృష్టకరమని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖలో వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని