హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

ప్రధానాంశాలు

హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ ధ్వజం

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ‘భారత రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలు, హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు దేశంలో కాషాయీకరణను అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. సామాజిక న్యాయం కోసం పోరాడే వారిపై కేంద్రం అక్రమ కేసులను బనాయించి దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరుకు సంఘీభావం ప్రకటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వివరిస్తూ కలిసి వచ్చే సంఘాలతో పోరాటం చేస్తామని బృందాకారాట్‌ తెలిపారు. సదస్సుకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి అధ్యక్షత వహించగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు తదితరులు హాజరయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని