close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోలింగ్‌ ముగిసేవరకూ పట్టుదలతో పనిచేయాలి

పార్టీ నేతలతో తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌లో పోలింగ్‌ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని తెరాస శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. పార్టీ ప్రచార వ్యూహం విజయవంతమైందన్నారు. గురువారం ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి నోముల భగత్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నేతలు కోటిరెడ్డి, అంజయ్య యాదవ్‌, పార్టీ ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడారని తెలిసింది. ‘దాదాపు మూడు వారాలుగా పార్టీ నేతలు, కార్యకర్తలు నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. వచ్చే రెండు రోజులూ శ్రేణులు పట్టుదలతో పనిచేయాలి. ఎక్కడా ఏమరుపాటు వద్దు. శుక్రవారం పోలింగ్‌ రోజు అనుసరించాల్సిన వైఖరిపై ఏజెంట్లకు దిశానిర్దేశం చేయాలి’’ అని సీఎం సూచించారని తెలిసింది. మరోవైపు వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలపై రెండు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ త్వరలో సమావేశం నిర్వహించనున్నారు. రెండు నగరాల్లోనూ కేటీఆర్‌ ఇటీవల పర్యటించారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు సన్నద్ధం చేశారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల తర్వాత సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు