లాక్‌డౌన్‌ పొడిగించవద్దు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ పొడిగించవద్దు

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 10 రోజుల పాటు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఆ తర్వాత పొడిగించవద్దని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కోరారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కరోనా రెండో వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న విషయం వాస్తవమే అయినా ప్రభుత్వం అన్ని రకాలుగా తగిన నివారణ చర్యల్ని చేపట్టడం సంతోషకరమన్నారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని లాక్‌డౌన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించవద్దని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన పది రోజుల లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమయ్యే పేదలకు ప్రభుత్వం అవసరమైన సహాయం అందజేస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు