నీటి అక్రమ తరలింపులో తండ్రిని మించిన జగన్‌
close

ప్రధానాంశాలు

నీటి అక్రమ తరలింపులో తండ్రిని మించిన జగన్‌

పాలమూరు పర్యటనలో మంత్రి వేముల

మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి నీటిని అక్రమంగా తరలిస్తే.. నేడు రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను చేపట్టి ఆయన కుమారుడు తండ్రిని మించిపోయారని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్‌ శివారు దివిటిపల్లిలో 1024 రెండు పడక గదుల ఇళ్లను ఆయన మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులపై గ్రీన్‌ ట్రైబ్యునల్‌ స్టే ఇచ్చినా, పనులు చేపట్టడం లేదని చెప్తూనే..జగన్‌ చాటుగా వాటిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ పనులు ఆపాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి చేయబోతున్నారని వేముల తెలిపారు. గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో అక్రమ ప్రాజెక్టులను అడ్డకునే ప్రయత్నం చేస్తామని, వినకపోతే ప్రజాయుద్ధానికి సిద్ధమవుతామని చెప్పారు. తమ నీటి హక్కును కూడా వారే తీసుకుంటామంటే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు. ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఒక ఎత్తువేస్తే తాము పది ఎత్తులు వేస్తామని, రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని