బీసీలకు అన్యాయం చేస్తున్న విపక్షాలు: లక్ష్మణ్‌

ప్రధానాంశాలు

బీసీలకు అన్యాయం చేస్తున్న విపక్షాలు: లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ విధానాలను అనుసరిస్తూ దేశంలోని విపక్ష పార్టీలు, భాజపాయేతర పార్టీల ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓబీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.  ఓటు బ్యాంకు కోసం ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్చి బీసీల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వాలపై త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం కాంగ్రెస్‌ విధానాలనే అనుసరిస్తోందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. జాతీయ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 27 మంది ఓబీసీ మంత్రులకు ఈ నెల 11న సన్మానం చేయనున్నట్లు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని