గంజాయి అక్రమ రవాణాలో ఏపీ ఎమ్మెల్యే కుమారుడు!

ప్రధానాంశాలు

గంజాయి అక్రమ రవాణాలో ఏపీ ఎమ్మెల్యే కుమారుడు!

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపణ

ఈనాడు, అమరావతి: తెలంగాణ సరిహద్దులో పోలీసులకు 60 కిలోల గంజాయితో పట్టుబడిన బృందంలో కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ఉదయభాను రెండో కుమారుడు ఉన్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ఆయనకు గంజాయి వ్యాపారంతో సంబంధం లేకపోతే.. సోమవారమే తన కుమారుడిని హైదరాబాద్‌లోని కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తీసుకొచ్చి రక్త, వెంట్రుకల నమూనాలు ఇప్పించడానికి సిద్ధమా?’ అని సవాల్‌ విసిరారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘కుమారుడితో పాటు నమూనాలు ఇవ్వడానికి ఎమ్మెల్యే ఉదయభాను ల్యాబ్‌కు వస్తే.. తాను, ఇతర తెదేపా నేతలు వచ్చి నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని