
తాజా వార్తలు
దీపక్ చాహర్‌లో ఈ కోణాన్ని చూశారా?
ఇంటర్నెట్‌డెస్క్: క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమవుతున్న భారత ఆటగాళ్లు ఖాళీ సమయాల్లో నచ్చిన కార్యకలాపాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కొందరు పుస్తకాలు చదువుతుంటే మరికొందరు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే టీమిండియా పేసర్ దీపక్ చాహర్ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన దిల్‌వాలె దుల్హానియా లేజాయేంగెలోని తుజె దేఖాతో హె జానా సనమ్ పాటను అద్భుతంగా గిటార్‌తో వాయించాడు. దీనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే చాహర్ గిటార్ వాయిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
మరోవైపు స్పిన్నర్ చాహల్ కూడా తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దానికి ఆలోచిస్తున్నట్లు ఎమోజీని జోడించాడు. దీనికి అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ‘ఏమి ఆలోచిస్తున్నావ్’ అని కామెంట్ చేయగా, క్వారంటైన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నానని చాహల్ సరదాగా రిప్లై ఇచ్చాడు. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా తొలి వన్డే జరగనుంది.