అందుకే టీమిండియా చెలరేగిపోయేది: పాంటింగ్‌
close

తాజా వార్తలు

Published : 25/08/2020 02:23 IST

అందుకే టీమిండియా చెలరేగిపోయేది: పాంటింగ్‌

ధోనీలా ప్రయత్నించి విఫలమయ్యానని వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెప్టెన్సీలో ధోనీకి, తనకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. ధోనీ నాయకత్వంలో ఆటగాళ్లు ఎంతో స్వేచ్ఛగా ఆడేవారని పేర్కొన్నాడు. మిస్టర్‌ కూల్‌ ఎందుకంత విజయవంతమైన కెప్టెన్‌ అయ్యాడో.. మహితో పోలిస్తే తనలో లేని ఓ ముఖ్య లక్షణాన్ని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. ‘ఫీల్డ్‌లో ధోనీ తన భావోద్వేగాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాడు. అది అతడిలోని ఓ ఉత్తమ గుణం. అలా ఉండేందుకు నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నాకు సాధ్యం కాలేదు. నేను ఎప్పుడూ పూర్తి కంట్రోల్‌లో లేను’ అని న్యూస్‌.కామ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఎప్పుడూ గెలిచేలాగే కనిపించేది. స్వేచ్ఛగా ఆడుతూ చెలరేగిపోయేది. జట్టు సభ్యుల్లో దాగిఉన్న పూర్తిస్థాయి ప్రతిభను వెలికితీసేందుకు అతడు నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం వల్లే అతడిని టీంమేట్స్‌ ఎక్కువగా ఇష్టపడేవాళ్లు’ అని రికీ వివరించాడు. ‘భారత్‌లో చాలా సమయం గడుపుతున్నాను. భారత మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి నాకు తెలుసు. నేను ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు అభిమానులు ధోనీ గురించి మాట్లాడుకోవడం విన్నాను. అతడి నాయకత్వం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే అతడి తత్వం గురించి అభిమానులు చర్చించుకునేవారు’ అని తెలిపాడు.

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ.. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. పాంటింగ్‌ నేతృత్యంలో ఆసీస్‌ జట్టు వరుస ప్రపంచకప్‌లను గెలుచుకుంది. మరోవైపు మూడు ఐసీసీ ట్రోఫీలు.. టీ20 ప్రపంచకప్‌, వన్డే వరల్డ్‌కప్‌, ఛాంపియన్‌ ప్రోపీలు అందిన నాయకుడిగా ధోనీ నిలిచాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని