close

తాజా వార్తలు

Published : 24/11/2020 08:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైనా పెద్ద మనసు

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఈ నెల 27న తన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. తన కూతురు పేరుతో ఉన్న ఎన్జీవో.. గ్రేసియా రైనా ఫౌండేషన్‌ తరపున ఉత్తరప్రదేశ్, జమ్ము, ఎన్‌సీఆర్‌ (జాతీయ రాజధాని ప్రాంతం)లో ఉన్న 34 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య, తాగునీటి వసతి సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకున్నాడు. దీంతో ఆరోగ్య, పరిశుభ్రత పరంగా 10వేలకు పైగా విద్యార్థులకు అండగా నిలవనున్నాడు. తన పుట్టినరోజు వేడుకలు ఆరంభించిన సందర్భంగా అతను, తన భార్య ప్రియాంకతో కలిసి గజియాబాద్‌లోని ఓ పాఠశాలలో అభివృద్ధి చేసిన తాగునీటి సౌకర్యాన్ని, బాలబాలికల కోసం వేర్వేరు మరుగుదొడ్లను, చేతులు, గిన్నెలు కడుక్కునే ప్రదేశాలతో పాటు స్మార్ట్‌ తరగతి గదులను ప్రారంభించాడు. అలాగే పేద కుటుంబాలకు చెందిన 500 మంది మాతృమూర్తులకు రైనా దంపతులు నిత్యవసరాలు అందించారు.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన