పుజారా కోసం ప్రత్యేక వ్యూహం

తాజా వార్తలు

Published : 24/12/2020 08:04 IST

పుజారా కోసం ప్రత్యేక వ్యూహం

మెల్‌బోర్న్‌: తొలి టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ పుజారాను కట్టడి చేసినప్పటికీ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో అతని నుంచి తమ జట్టుకు ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ తెలిపాడు. ‘‘నేను జట్టు రహస్యాలు బయటపెట్టలేను. కానీ ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌ అయిన పుజారాతో సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో మాకు పెద్ద సవాలే ఎదురుకానుంది. సిరీస్‌కు ముందు అతణ్ని కట్టడి చేయడం గురించి చర్చించుకున్నాం. ఆ దిశగా అడిలైడ్‌ టెస్టులో కొన్ని ప్రణాళికలు పనిచేశాయి. మరికొన్ని వ్యూహాలూ సిద్ధంగా ఉన్నాయి. అతను బరిలో దిగితే మా ఉచ్చులో బిగిస్తామనే నమ్మకంతో ఉన్నా. ప్రపంచ ఉత్తమ ఆటగాడిని సవాలు చేయడం సరదాగా ఉంటుంది. పుజారా కూడా అలాంటి ఆటగాడే’’ అని అతను చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులో కుదురుకున్న పుజారా (43)ను లైయన్‌ ఔట్‌్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు స్వదేశానికి వెళ్లిన కోహ్లి లోటును భర్తీ చేయగల ఆటగాళ్లు టీమ్‌ఇండియాలో ఉన్నారని లైయన్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘కోహ్లీని భర్తీ చేసే ఆటగాళ్ల పేర్లు చెప్పాలంటే.. రహానె, పుజారా. వీళ్లే కాకుండా రాహుల్, మయాంక్‌ కూడా జట్టులో ఉన్నారు. కాబట్టి ఆ లోటు కనిపించదనే అనుకుంటున్నా. బాక్సింగ్‌ డే టెస్టులో ఎదురు కానున్న కఠిన సవాలుకు మేం మెరుగ్గా సిద్ధమవాల్సి ఉంది’’ అని అతనన్నాడు. 

ఇవీ చదవండి..

రెండో టెస్టుకూ వార్నర్‌ దూరం

స్టాండ్‌కు నా పేరు తీసేయండి

రాహుల్‌కు చోటు లేదా?

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని