INDvsENG: పుజారా స్థానంలో పృథ్వీని ఆడించాలి

తాజా వార్తలు

Published : 04/07/2021 01:38 IST

INDvsENG: పుజారా స్థానంలో పృథ్వీని ఆడించాలి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు జట్టులో చెతేశ్వర్‌ పుజారా స్థానంలో యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషాను ఆడించాలని, మూడో స్థానంలో అతడే సరైన ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ అభిప్రాయపడ్డాడు. వచ్చేనెల ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో పుజారాకు బదులు కేఎల్‌ రాహుల్‌ను ఆడించాలా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బ్రాడ్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘పుజారాను ఎవరైనా రీప్లేస్‌ చేయాలంటే అది పృథ్వీషానే. అతడు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ కన్నా మూడో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. పృథ్వీకి ఎంతో నైపుణ్యం ఉండటంతో పాటు సుదీర్ఘ భవిష్యత్‌ ఉంది. ఇప్పుడతడు ఇంగ్లాండ్‌ పర్యటనలో లేకపోయినా వైల్డ్‌కార్డ్‌ అవకాశం ఉంది’ అని హాగ్‌ జవాబిచ్చాడు. కాగా, ఈ యువ ఓపెనర్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడనే సంగతి తెలిసిందే. మరో పది రోజుల్లో శ్రీలంకతో ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అక్కడ పర్యటిస్తున్నాడు.

మరోవైపు టీమ్‌ఇండియా ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అప్పుడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ జట్టులోని ఆటగాళ్ల ఆటతీరుపై పరిశీలన చేయాలన్నాడు. ఎవరి పేరూ ప్రస్తావించకుండా పలువురు ఆటగాళ్లు అవసరమైన పరుగులు చేయడంలో ఆసక్తి చూపలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన పుజారా తర్వాత ఇంగ్లాండ్‌ సిరీస్‌ నుంచి విఫలమవుతున్నాడు. గత నాలుగు టెస్టుల్లో అతడు ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడికి బదులు షాను ఆడించాలని బ్రాడ్‌హాగ్‌ సెలవిచ్చాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని