జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్‌ఇండియా

తాజా వార్తలు

Published : 05/01/2021 02:21 IST

జూలో జంతువుల్లా చేస్తారా:టీమ్‌ఇండియా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా పర్యటనలో తమ స్వేచ్ఛను హరించడంపై టీమ్‌ఇండియా క్రికెటర్లు తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. ప్రదర్శనశాలలో జంతువుల్లా తమతో వ్యవహరించొద్దని కోరినట్టు తెలిసింది. మైదానంలోకి వేలాది మందిని అనుమతించాక తమను మాత్రం హోటల్‌ గదులకే పరిమితం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అక్కడి పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛను నెగెటివ్‌గా తేలిన తమకెందుకు ఇవ్వరని గళం విప్పినట్టు టీమ్‌ఇండియా జట్టు వర్గాలు ‘క్రిక్‌ బజ్‌’తో అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

క్రికెటేతర విషయాలతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ వార్తల్లోకి ఎక్కింది. రోహిత్‌ సహా ఐదుగురు క్రికెటర్లు హోటల్‌కు వెళ్లి భోజనం చేయడం, కోహ్లీ, పాండ్య ఓ దుకాణంలోకి వెళ్లడాన్ని ఆసీస్‌ మీడియా అతిచేసి చూపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిడ్నీలో కేసులు పెరుగుతుండటం, ఇక్కడి నుంచి బ్రిస్బేన్‌ సరిహద్దులు మూసేయడంతో క్రికెటర్లపై ఆంక్షలు పెరుగుతున్నాయి. అయితే అక్కడి పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛను సైతం ఇవ్వకుండా ఆంక్షల పేరుతో కట్టడి చేయడాన్ని టీమ్‌ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాలుగో టెస్టును బహిష్కరించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

‘అభిమానులను మైదానాల్లోకి అనుమతించి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. కానీ మమ్మల్ని మాత్రం ఆట ముగియగానే హోటల్‌కెళ్లి క్వారంటైన్‌ కావాలని అంటున్నారు. ఇవి రెండూ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. నెగెటివ్‌గా తేలిన తర్వాతా ప్రత్యేకించి ఇలా చేయడం బాధాకరం. జూలో జంతువుల్లా మాతో వ్యవహరించొద్దని కోరుకుంటున్నాం. మొదట్లో ఏం చెప్పామో దానికే కట్టుబడి ఉన్నాం. ఆస్ట్రేలియా పౌరులకు ఎలాంటి నిబంధనలు ఉంటాయో మాకూ అలాగే ఉండాలి. అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించి మమ్మల్ని క్వారంటైన్‌ అవ్వాలనడంలో అర్థం లేదు’ అని టీమ్‌ఇండియా వర్గాలు అంటున్నాయి.

‘సిరీసు మధ్యలో హోటల్‌ క్వారంటైన్ మాకిష్టం లేదు. మాస్కులు ధరించడం, రెడ్‌జోన్లకు వెళ్లకపోవడం వంటివి మేం పాటిస్తాం. ఆటగాళ్లు ఔట్‌డోర్‌లో తినడానికే వెళ్లారు. వర్షం రావడంతోనే లోపలికి వెళ్లారు. కొవిడ్‌ నెగెటివ్‌ తేలిన తర్వాతా విమానంలో ప్రత్యేకంగా ఎందుకు కూర్చోబెట్టారో, ఐసోలేషన్‌కు ఎందుకు పంపించారో అర్థం కావడం లేదు. ఇప్పటికే మా ఆటగాళ్లు ఎన్నో త్యాగాలు చేశారు. మహ్మద్‌ సిరాజ్‌ తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేదు. కొందరైతే ఆరు నెలలుగా బుడగలో ఉంటున్నారు. ఇదంత సులభమేమీ కాదు’ జట్టు వర్గాలు తెలిపాయి.

ఇవీ చదవండి
రోహిత్‌శర్మ సహా.. అందరికీ కరోనా నెగెటివ్‌
ఆసీస్‌ క్రికెటర్లను సొంతంగా చదివిన అజింక్య!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని