INDvsENG‌: టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 138/4

తాజా వార్తలు

Updated : 04/08/2021 20:47 IST

INDvsENG‌: టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 138/4

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాటింగ్‌హామ్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ టీ విరామ సమయానికి 138/4 స్కోర్ సాధించింది. తొలి సెషన్‌లో 61 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి.. రెండో సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు షమీ షాకిచ్చాడు. డొమినిక్‌ సిబ్లీ (18) షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 27వ ఓవర్లో కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ స్టో (29)తో కలిసి కెప్టెన్‌ జో రూట్‌ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించాడు.ఈ క్రమంలోనే రూట్‌(51) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ వేసిన 50.2 ఓవర్‌కు బెయిర్‌ స్టో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. షమీ రెండు వికెట్లు తీశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని