
తాజా వార్తలు
ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
స్మిత్‌కు షాక్.. సంజూకు సారథ్యం.
సొంతగూటికి రైనా.. మాక్సీకి ఉద్వాసన
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021లో ఏయే ఫ్రాంచైజీల్లో ఎవరెవరు ఆడనున్నారో దాదాపుగా తెలిసిపోయింది. తాజా సీజన్ కోసం తమ వద్ద అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు.. వదిలేసిన క్రికెటర్ల జాబితాలను ఫ్రాంచైజీలు ప్రకటించాయి. చాలావరకు వెటరన్ క్రికెటర్లను పక్కనపెట్టేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ స్టీవ్‌స్మిత్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. అంతేకాకుండా యువ ఆటగాడు సంజు శాంసన్‌ను సారథిగా ఎంపికచేసింది. సురేశ్ రైనా తిరిగి తన సొంతగూడు చెన్నై సూపర్‌కింగ్స్‌కు చేరుకున్నాడు. గత సీజన్లో అన్ని మ్యాచులూ ఆడి తక్కువ పరుగులు చేసిన మాక్స్‌వెల్‌ను పంజాబ్ పక్కనపెట్టేసింది. ఏయే జట్టులో ఎవరెవరున్నారంటే..
దిల్లీ.. మార్పుల్లేవ్
గత సీజన్ రన్నరప్ దిల్లీ అనూహ్య నిర్ణయాలేమీ తీసుకోలేదు. కీలకమైన ఆటగాళ్లను అలాగే అట్టిపెట్టుకుంది. భారత ఆటగాళ్లకు ఎప్పటిలాగే ప్రాధాన్యం ఇచ్చింది. ఆరుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. శిఖర్ ధావన్, కాగిసో రబాడా, పృథ్వీషా, అజింక్య రహానె, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఆన్రిచ్ నోర్జె, మార్కస్ స్టొయినిస్, షిమ్రన్ హెట్‌మైయిర్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, డేనియెల్ సామ్స్, అవేశ్ ఖాన్, ప్రవీణ్ దూబెను అట్టిపెట్టుకుంది. మోహిత్ శర్మ, కీమో పాల్, సందీప్ లామిచాన్, అలెక్స్ కేరీ, జేసన్ రాయ్, తుషార్ దేశ్‌పాండేను విడుదల చేసింది. రాబోయే సీజన్లో దిల్లీ ఎక్కువ మంది ఆటగాళ్లను తీసుకోకపోవచ్చు.
ముంబయి.. కోర్‌గ్రూప్ అలాగే
ఐపీఎల్-2020 విజేత ముంబయి ఇండియన్స్‌లోనూ ఆసక్తికర మార్పులేమీ లేవు. అయితే లీగు చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగను మాత్రం విడుదల చేసింది. ఇన్నాళ్ల కెరీర్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఎప్పుడూ ఆడలేదు. వాళ్ల కోర్‌గ్రూప్ ఎప్పటిలాగే బలంగా ఉంది. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, ట్రెంట్‌బౌల్ట్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, క్రిస్‌లిన్, ధవళ్ కుల్కర్ణి, మోహిసిన్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆదిత్య తారె, సౌరభ్ తివారి, జయంత్ యాదవ్, అన్మోల్ప్రీత్సింగ్ను అట్టిపెట్టుకుంది. లసిత్ మలింగ, నేథన్ కౌల్టర్‌నైల్, జేమ్స్ ప్యాటిన్సన్, రూథర్‌ఫర్డ్, మిచెల్ మెక్లెనగన్, ప్రిన్స్ బలవంత్ రాయ్, దిగ్విజయ్ దేశముఖ్‌ను విడుదల చేసింది.
కోల్‌కతా.. ఎప్పటిలాగే
కోల్‌కతా నైట్‌రైడర్స్ సైతం భారీ మార్పులు చేయలేదు. మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను అట్టిపెట్టుకుంది. కీలక బృందం జోలికి వెళ్లలేదు. సాధారణ ఆటగాళ్లనే విడుదల చేసింది. ఇయాన్ మోర్గాన్, ఆండ్రి రసెల్, దినేశ్ కార్తీక్, కమలేశ్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, నితీశ్ రాణా, ప్రసిధ్ కృష్ణ, రింకూ సింగ్, సందీప్ వారియర్, శివమ్ మావి, శుభ్‌మన్ గిల్, సునిల్ నరైన్, ప్యాట్ కమిన్స్, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, అలీఖాన్, టిమ్ సీఫెర్ట్‌ను కేకేఆర్ అట్టిపెట్టుకుంది. టామ్ బాంటన్, క్రిస్ గ్రీన్, సిద్దేశ్ లాడ్, నిఖిల్ నాయక్, ఎం.సిద్ధార్థ్, హ్యారీ గర్నీని వదిలేసింది.
చెన్నై.. గూటికి రైనా
ఐపీఎల్లో అత్యంత విలువైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్ కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. తమ స్టార్ ఆటగాడు సురేశ్ రైనాను తిరిగి తీసుకుంది. వెటరన్ క్రికెటర్లను పక్కన పెట్టేసింది. ఎంఎస్ ధోనీ నాయకుడిగానే ఉండనున్నాడు. స్థానిక క్రికెటర్ మురళీ విజయ్ను వదిలేయడం గమనార్హం. ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, డుప్లెసిస్, సామ్ కరణ్, డ్వేన్ బ్రావో, జోష్ హేజిల్‌వుడ్, లుంగి ఎంగిడి, అంబటి రాయుడు, కర్ణ్‌శర్మ, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్, ఎన్.జగదీశన్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్, ఆర్.సాయి కిషోర్‌ను చెన్నై అట్టిపెట్టుకుంది. పియూష్ చావ్లా, కేదార్ జాదవ్, మురళీ విజయ్, హర్భజన్‌సింగ్, మోనుకుమార్ సింగ్‌ను వదిలేసింది. షేన్‌వాట్సన్ రిటైర్ అయ్యాడు.
బెంగళూరు.. ఎక్కువే వదిలేసింది
చివరి సీజన్లో అంచనాలను అందుకుంటున్నట్టు కనిపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరికి అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. దాంతో ఈసారి చాలామంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఆరోన్ ఫించ్ సైతం ఉండటం గమనార్హం. కొద్ది మందిని మాత్రమే అట్టిపెట్టుకుంది. కోహ్లీ నమ్మినవాళ్లు అలాగే ఉన్నారు. రానున్న వేలంలో బెంగళూరు కొందరు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అట్టిపెట్టుకున్న వారిలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యుజువేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిఫ్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే ఉన్నారు. ఇక మొయిన్ అలీ, శివమ్ దూబె, గురుకీరత్ సింగ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, ఇరుసు ఉదాన, ఉమేశ్ యాదవ్‌ను వదిలేసింది. పార్థివ్ రిటైర్ కాగా డేల్ స్టెయిన్ అందుబాటులో ఉండటం లేదు.
హైదరాబాద్.. యువకులకే పెద్దపీట
సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ మంది ఆటగాళ్లను వదిలేసింది. మిగతా వారిని అలాగే అట్టిపెట్టుకుంది. తమ కోర్ గ్రూప్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. భవిష్యత్తు దృష్ట్యా యువకులకు పెద్దపీట వేసింది. డేవిడ్ వార్నర్, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్ సాహా, శ్రీవత్స గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, మహ్మద్ నబి, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, సందీప్ శర్మ, బాసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్ అట్టిపెట్టుకున్న జాబితాలో ఉన్నారు. బిల్లీ స్టాన్లేక్, ఫాబియన్ అలన్, సంజయ్యాదవ్, బి సందీప్, పృథ్వీరాజ్‌ను విడుదల చేసింది.
స్మిత్‌కు షాక్.. సంజుకు ప్రమోషన్
ఈ సారి అనూహ్య నిర్ణయం తీసుకున్నది మాత్రం రాజస్థాన్ రాయల్సే. ఎప్పటి నుంచో విశ్వాసం పెట్టుకున్న స్టీవ్‌స్మిత్‌ను అట్టిపెట్టుకోలేదు. అతడి ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. ఇక కుర్రాడు సంజు శాంసన్‌కు ఏకంగా సారథ్యం అప్పజెప్పింది. 17మందిని తిరిగి తీసుకుంది. డేవిడ్ మిల్లర్‌పై నమ్మకం ఉంచింది. సంజు శాంసన్, మనన్ వోహ్రా, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, రాబిన్ ఉతప్ప, అనుజ్ రావత్, బెన్‌స్టోక్స్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్, మయాంక్ మర్కండే, ఆండ్రూ టైను రాజస్థాన్ రీటెయిన్ చేసుకుంది.
పంజాబ్.. అనుకున్నదే చేసింది
యూఏఈలో అనూహ్య ప్రదర్శనతో ఆకట్టుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి మళ్లీ వరుసగా ఐదు మ్యాచులు గెలిచి సంచలనం సృష్టించింది. ప్లేఆఫ్స్‌పై ఆశలు రేకెత్తించింది. అయితే విఫలమైన మాక్స్వెల్, కాట్రెల్, నీషమ్‌ను పంజాబ్ వదిలేసింది. కృష్ణప్ప గౌతమ్, ముజీబుర్ రెహ్మాన్, విల్జోయిన్, కరుణ్ నాయర్‌ను పక్కనపెట్టింది. కేఎల్ రాహుల్, మన్దీప్ సింగ్, నికోలస్ పూరన్, క్రిస్‌గేల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, ఇషాన్ పోరెల్, మురుగన్ అశ్విన్, దర్శన్ నల్కండేను అట్టిపెట్టుకుంది.