IPL 2021: ముంబయి లక్ష్యం 136 పరుగులు

తాజా వార్తలు

Published : 28/09/2021 21:30 IST

IPL 2021: ముంబయి లక్ష్యం 136 పరుగులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (42; 29 బంతుల్లో 6 ఫోర్లు), దీపక్‌ హుడా (28 ) రాణించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కి ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (21), మన్‌దీప్‌ సింగ్‌ (15) శుభారంభం అందించారు. అయితే, కృనాల్‌ పాండ్య వేసిన ఆరో ఓవర్లో మన్‌దీప్‌ సింగ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్‌ 36 పరుగుల మొదటి వికెట్‌ కోల్పోయింది. తర్వాత కీరన్‌ పొలార్డ్ వేసిన ఓవర్‌లో పంజాబ్‌కి గట్టి షాక్‌ తగిలింది. ఒకే ఓవర్‌లో క్రిస్‌ గేల్‌ (1), కేఎల్ రాహుల్ ఔటయ్యారు. ఎనిమిదో ఓవర్‌లో నికోలస్ పూరన్‌ (2)ని బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. దీంతో పంజాబ్‌ కష్టాల్లో పడింది.  మార్‌క్రమ్‌, దీపక్‌ హుడా ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు.  బౌల్ట్ వేసిన 15వ ఓవర్‌లో మార్‌క్రమ్‌ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. హుడా ఓ బౌండరీ బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.  ప్రమాదకరంగా మారుతున్న మార్‌క్రమ్‌ని రాహుల్‌ చాహర్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు.  బుమ్రా వేసిన 19వ ఓవర్లో దీపక్‌ హుడా  పొలార్డ్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. నాథన్ ఎలిస్‌ (6), హర్‌ప్రీత్‌ బ్రర్ (14) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో పొలార్డ్‌, బుమ్రా రెండు, రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ పాండ్య తలో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని