mirabai chanu: మణిపుర్‌కే కాదు.. నేను దేశం మొత్తానికీ చెందుతాను

తాజా వార్తలు

Published : 24/07/2021 17:20 IST

mirabai chanu: మణిపుర్‌కే కాదు.. నేను దేశం మొత్తానికీ చెందుతాను

దేశపౌరులకు కృతజ్ఞతలు తెలియజేసిన మీరాబాయి

టోక్యో: ఐదేళ్లుగా కంటున్న కల నిజమైనందుకు సంతోషంగా ఉందని భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను తెలిపింది. స్వర్ణం కోసం తీవ్రంగా ప్రయత్నించానని పేర్కొంది. ఈ విజయం వెనక ఎంతోమంది కృషి ఉందని వారికి కృతజ్ఞతలు తెలియజేసింది.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. 49కిలోల విభాగంలో ఆమె రజత పతకం గెలిచింది. స్నాచ్‌లో 87 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్‌తో పతకం గెలిచిన రెండో వెయిట్‌ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది.

‘చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్లుగా దీనిని కలగంటున్నా. నాకిప్పుడు గర్వంగా ఉంది. స్వర్ణం కోసమే ప్రయత్నించా. కానీ రజతమూ గొప్ప ఘనతే. దేశం తరఫున ఈ ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచినందుకు ఆనందంగా ఉంది. నేను మణిపుర్‌కు మాత్రమే కాదు ఈ దేశం మొత్తానికీ చెందుతాను’ అని మీరాబాయి తెలిపింది.

‘నా కోచ్‌ విజయ్‌ శర్మ, సహాయ బృందానికి, వారి నిరంతర సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. నాకు శిక్షణనివ్వడమే కాకుండా ప్రతిక్షణం నాలో ప్రేరణ నింపారు. అలాగే నా కుటుంబం, ప్రత్యేకంగా మా అమ్మకు ధన్యవాదాలు. ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. నన్ను నమ్మింది. ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ, సాయ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య, ఐఓఏ, ఇండియన్‌ రైల్వేస్‌, స్పాన్సర్లు సహా అందరికీ కృతజ్ఞతలు’ అని మీరాబాయి పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని