Mithali Raj: స్టెఫానీ 1.. మిథాలి రాజ్‌ 2

తాజా వార్తలు

Published : 14/07/2021 01:20 IST

Mithali Raj: స్టెఫానీ 1.. మిథాలి రాజ్‌ 2

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళల వన్డే జట్టు సారథి మిథాలి రాజ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంక్‌ కోల్పోయి రెండో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌ కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఆమె టాప్‌లోకి దూసుకెళ్లింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది.

తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ సారథి శతకంతో కదం తొక్కడమే కాకుండా బౌలింగ్‌లోనూ 3/29 అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే ఆమె వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మిథాలిని, ఆల్‌రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఎలిసిపెర్రీని వెనకేసుకొచ్చింది. మరోవైపు బౌలింగ్‌ విభాగంలోనూ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ ర్యాంక్‌ దక్కించుకుంది. ఇక టీమ్‌ఇండియా వెటరన్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి ఐదో ర్యాంక్‌ సాధించగా, ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ అదే ర్యాంక్‌ సొంతం చేసుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని