టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన కివీస్‌

తాజా వార్తలు

Updated : 02/02/2021 19:01 IST

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరిన కివీస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. కరోనా కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా దూరం కావడంతో కివీస్‌ తుదిపోరుకు చేరింది. ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్‌ వేదికగా తెలిపింది. లార్డ్స్‌ మైదానంలో జరగనున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కివీస్‌ బెర్తు సాధించిందని వెల్లడించింది.

అయితే కివీస్‌ ప్రత్యర్థి స్థానం కోసం భారత్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతునున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న భారత్×ఇంగ్లాండ్ నాలుగు టెస్టుల సిరీస్‌ ఫలితంతో తుదిపోరుకు చేరే మరో జట్టు ఎవరనేది తేలనుంది. భారత్‌ జట్టు అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్‌పై 2-0, 2-1, 3-0, 3-1 లేదా 4-0 తేడాతో విజయం సాధించాలి. అదే ఫైనల్‌కు ఇంగ్లాండ్ చేరాలంటే భారత్‌పై 3-0, 3-1 లేదా 4-0 తేడాతో గెలవాలి.

మరోవైపు ఆస్ట్రేలియాకు కూడా అవకాశాలు ఉన్నాయి.  భారత్‌ 1-0తో లేదా ఇంగ్లాండ్ 1-0, 2-0, 2-1 తేడాతో సిరీస్‌ను సాధిస్తే ఆసీస్‌కు అవకాశాలు ఉంటాయి. అంతేగాక భారత్×ఇంగ్లాండ్‌ సిరీస్‌ 0-0, 1-1, 2-2తో ‘డ్రా’ గా ముగిసినా కంగారూలకు ఛాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ (71.7 విజయశాతం), న్యూజిలాండ్ (70%), ఆస్ట్రేలియా (69.2%), ఇంగ్లాండ్ (68.7%) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి

నేను వాటిని విడిచిపెట్టను: లాంగర్‌

అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు: రాహుల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని