ఆస్పత్రిలో నటరాజన్‌.. సర్జరీ పూర్తి

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:34 IST

ఆస్పత్రిలో నటరాజన్‌.. సర్జరీ పూర్తి

(Photo: Natarajan Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ టి.నటరాజన్‌ మంగళవారం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గతవారం గాయం కారణంగా ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు సర్జరీ చేయించుకొని బాగున్నట్లు తెలిపాడు. కొద్దిసేపటి క్రితం ఆస్పత్రిలో బెడ్‌మీదున్న ఫొటోను ట్విటర్‌లో పంచుకొని ఈ విషయాన్ని తెలియజేశాడు. ఈ సందర్భంగా తన పట్ల అమితమైన శ్రద్ధ చూపిన వైద్య సిబ్బందికి, డాక్టర్లకు నటరాజన్‌ ధన్యవాదాలు చెప్పాడు. అలాగే బీసీసీఐకి, తన కోసం ప్రార్థించిన వారికి కూడా రుణపడి ఉంటానని పేర్కొన్నాడు.

కాగా, గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఈ సన్‌రైజర్స్‌ పేసర్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి హైదరాబాద్‌ తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. దాంతో టీమ్‌ఇండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే, అక్కడ అనుకోని పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్న నటరాజన్‌ తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లకు సైతం ఎంపికయ్యాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లోనూ రెండు మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని మిగతా సీజన్‌కు దూరమయ్యాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని