IND vs ENG: రెండో సెషన్‌ విజయవంతం.. రోహిత్‌, పుజారా బ్యాటింగ్‌

తాజా వార్తలు

Updated : 27/08/2021 20:28 IST

IND vs ENG: రెండో సెషన్‌ విజయవంతం.. రోహిత్‌, పుజారా బ్యాటింగ్‌

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఈ క్రమంలోనే రెండో సెషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. రోహిత్‌(59) అర్ధశతకంతో కొనసాగుతుండగా, పుజారా(40) చక్కటి సహకారం అందిస్తున్నాడు. దాంతో టీమ్ఇండియా రెండో సెసన్‌ పూర్తయ్యేసరికి 112/1తో నిలిచింది. వీరిద్దరూ ఈ సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడి 78 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ కన్నా భారత్‌ 242 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. అంతకుముందు భోజన విరామ సమయానికి భారత్‌ 34/1తో నిలిచిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(8) ఓవర్టన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని