Sanju Samson: ఐపీఎల్‌ ఆడుతూ టీమ్‌ఇండియా గురించి ఆలోచించడం తప్పు: సంజూ శాంసన్

తాజా వార్తలు

Published : 15/09/2021 13:10 IST

Sanju Samson: ఐపీఎల్‌ ఆడుతూ టీమ్‌ఇండియా గురించి ఆలోచించడం తప్పు: సంజూ శాంసన్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ ఆడుతూ టీమ్‌ఇండియా ఎంపిక కోసం ఆలోచించడం తప్పని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2015లో తొలిసారి భారత్‌ తరఫున టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు తర్వాత ఐదేళ్లు మళ్లీ టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కనిపించలేదు. గతేడాది నుంచి పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే రాబోయే టీ20 ప్రపంచకప్‌ జట్టులో సంజూ స్థానం దక్కించుకోలేకపోయాడు.

‘మీరు ఒక ఐపీఎల్ టీమ్‌లో ఆడేటప్పుడు టీమ్‌ఇండియా సెలెక్షన్‌ గురించి ఆలోచించడం తప్పు. టీమ్‌ఇండియా సెలెక్షన్‌ గురించి, జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలని బయట చాలామంది మాట్లాడుకుంటారు. కానీ, అసలు విషయం ఏంటంటే ఐపీఎల్‌ ప్రదర్శన కేవలం జట్టు ఎంపికకు ఒక ప్రామాణికం మాత్రమే. ఎవరైనా బాగా ఆడితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి’ అని సంజూ పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌కు ఎంతో ఆదరణ ఉందని.. దీంతో మంచి గుర్తింపు వస్తుందని రాజస్థాన్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే చాలా మంది చాలా విషయాలు మాట్లాడుకుంటారన్నాడు. ప్రతి ఒక్కరికీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని.. తనలాంటి వాళ్లు చాలా మంది తుది జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని సంజూ గుర్తుచేశాడు. భారత క్రికెట్‌ సక్సెస్‌కు ఇదే నిదర్శనమని పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని