కిదాంబి ముందడుగు.. కశ్యప్‌ మధ్యలోనే..

తాజా వార్తలు

Published : 13/01/2021 20:22 IST

కిదాంబి ముందడుగు.. కశ్యప్‌ మధ్యలోనే..

బ్యాంకాక్‌: బ్యాడ్మింటన్‌ పురుషుల మాజీ ప్రపంచ నెంబర్‌ వన్‌ కిదాంబి శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్లో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్‌లో సహచరుడు సౌరభ్‌వర్మతో జరిగిన పోరులో 21-12, 21-11తో విజయం సాధించాడు. కేవలం అరగంటలో మ్యాచును ముగించి రెండోరౌండ్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు కరోనా పరీక్ష వల్ల శ్రీకాంత్‌ ముక్కులోంచి రక్తస్రావం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బీడబ్ల్యూఎఫ్‌ పరీక్షల ప్రక్రియ సాఫీగా సాగేలా జోక్యం చేసుకుంది.

మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ మ్యాచ్‌ మధ్యలోనే నిష్ర్కమించాడు. కెనడా షట్లర్‌ జేసన్‌ ఆంథోనితో జరుగుతున్న పోరులో మూడోరౌండ్లో 8-14తో వెనకబడినప్పుడు అతడు ఆటను వదిలేశాడు. పిక్క కండరాలు పట్టేయడంతో అతడీ నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందు మొదటి గేమ్‌లో 9-21తో వెనకబడ్డ అతడు రెండో గేమ్‌లో పోరాడి 21-13తో నిలిచాడు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ కొరియన్‌ ద్వయం కిమ్‌ జి జంగ్‌, లీ యాంగ్‌ డేపై 19-21, 21-16, 21-14తో విజయం సాధించింది. తాము ఆదర్శంగా భావించే లీ యాంగ్‌ డేపై గెలిచినందుకు సాత్విక్, చిరాగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా అర్జున్‌ ముదతిల్‌ రామచంద్రన్‌, ధ్రువ్‌ కపిల జోడీ మలేసియా ద్వయం ఆంగ్‌ యీ సిన్‌, టియో ఈ యి చేతిలో 21-13, 8-21, 22-24 తేడాతో ఓటమి పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎన్‌ సిక్కిరెడ్డి, సుమీత్‌ రెడ్డి ద్వయం 20-22, 17-21 తేడాతో చంగ్‌ మన్‌ తంగ్‌, యోంగ్‌ సూట్‌ సె చేతిలో ఓటమి పాలైంది.

ఇవీ చదవండి
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని