కోహ్లి ముందే హెచ్చరించాడు : ఒలీ పోప్‌
close

తాజా వార్తలు

Published : 03/04/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లి ముందే హెచ్చరించాడు : ఒలీ పోప్‌

లండన్‌: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి తన దగ్గరకు వచ్చి హెచ్చరికలు జారీ చేశాడని ఇంగ్లాండ్‌ యువ బ్యాట్స్‌మన్‌ ఒలీ పోప్‌ అన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా ఈ సంఘటన జరిగిందని అతడు చెప్పాడు. ‘‘ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సాగుతుండగా.. నాన్‌స్ట్రెయికింగ్‌లో ఉన్న నా దగ్గరకు వచ్చిన కోహ్లి.. ‘ఈ సిరీస్‌లో ఇదే చివరి ఫ్లాట్‌ వికెట్‌’ అని నాతో చెప్పాడు. అప్పుడే అర్థమైంది ఈ సిరీస్‌లో మిగిలిన టెస్టులు ఆడడం మాకు పెద్ద సవాల్‌గా మారనుందని. ఆ తర్వాత అదే నిజమైంది. బంతి స్పిన్‌కు విపరీతంగా సహకరించింది. జట్టులో సీనియర్లు రూట్, స్టోక్స్‌ కూడా ఇంత కఠినమైన పిచ్‌లపై ఆడలేదని చెప్పారు. సాధారణంగా తొలి మూడు రోజులు బ్యాటింగ్‌ను అనుకూలిస్తూ.. చివరి రెండు రోజులు స్పిన్‌కు సహకరించడం భారత్‌ పిచ్‌ల లక్షణం.. కానీ టీమ్‌ఇండియాతో తాజా సిరీస్‌లో తొలి రోజు నుంచే బంతి గిర్రున తిరిగింది’’ అని పోప్‌ గుర్తు చేసుకున్నాడు. రూట్‌ (228) డబుల్‌ సెంచరీ చేసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 227 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో స్పిన్నర్లదే రాజ్యం కావడంతో టీమ్‌ఇండియా 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్పిన్నర్లు అశ్విన్, అక్షర్‌ పటేల్‌ ఇద్దరూ కలిసి 60 వికెట్లు పడగొట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని