close
సబ్‌స్టిట్యూట్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయొచ్చు

క్రికెట్‌ను మరింత సురక్షిత క్రీడగా మార్చేందుకు ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్లో ‘కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌’ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల మొదలయ్యే యాషెస్‌ సిరీస్‌తో ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లలో అమలు చేస్తారు. 2014లో షెఫీల్డ్‌ షీల్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఫిల్‌ హ్యూస్‌ తలకు బంతి తగిలి దుర్మరణం చెందినప్పటి నుంచి ‘కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌’పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ సబ్‌స్టిట్యూట్‌ విధానాన్ని ధ్రువీకరించి, వెంటనే అమలు చేసే అవకాశముంది. దీంతో యాషెస్‌ సిరీస్‌తో మొదలెట్టి.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లకు ఈ నిబంధనను వర్తింపచేయవచ్చు. 
తలకు ఏదైనా బలంగా తగిలినప్పుడు ఈ కంకషన్‌ స్థితి వస్తుంది. మెదడు అదురుతుంది. తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం, తలతిరిగినట్లు ఉండడం, కాసేపు దృష్టి మందగించడం, సమతూకం దెబ్బతినడం కంకషన్‌ లక్షణాల్లో కొన్ని. బౌన్సర్‌ తాకినప్పుడు బ్యాట్స్‌మెన్‌, బ్యాట్స్‌మెన్‌కు అతి సమీపంగా ఫీల్డింగ్‌ చేసే ఫీల్డర్లు ఇలాంటి గాయానికి గురికావొచ్చు. తలకు గాయం అయిన తర్వాత రోజులు, వారాలకు కూడా ఈ లక్షణాలు బయటపడవచ్చు. ఇలా గాయపడ్డ ఆటగాడు ఆట కొనసాగించడం ప్రమాదకరం. 2017లో ఐసీసీ రెండేళ్ల కాలానికి ప్రయోగాత్మకంగా దేశవాళీ క్రికెట్లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్లను అనుమతించింది. 
కొత్త నిబంధనను ఆమోదించనున్న ఐసీసీ 
క్రికెట్లో ఓ ఆటగాడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే అతడి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ మాత్రమే చేయగలడు. ఈ నిబంధనకు ఐసీసీ ముఖ్యమైన సవరణ చేయనుంది. ఓ క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌ హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పించనుంది. మొదటిసారి ఈ కొత్త నిబంధనను వచ్చే నెలలో ఆరంభమయ్యే యాషెస్‌ సిరీస్‌లో అమలు చేసే అవకాశముంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.