close
సత్తాచాటిన సాయి, నితీశ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బీసీసీఐ పురుషుల అండర్‌-19 ఛాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా- ఎ మరో విజయాన్ని సాధించింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇండియా- ఎ 43 పరుగుల తేడాతో ఇండియా- బి జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ‘ఎ’ 50 ఓవర్లలో 8 వికెట్లకు 304 పరుగులు భారీస్కోరు చేసింది. ఆ జట్టులో సాయి భరద్వాజ్‌ (74), అర్జున్‌ (47) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో వివేక్‌ (3/48) ఆకట్టుకున్నాడు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ‘బి’ 46.2 ఓవర్లలో 261 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ ప్రియమ్‌ (50), సాగర్‌ (45) పోరాడారు. ఆంధ్ర కుర్రాడు నితీశ్‌ కుమార్‌ (3/53) ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.