close

ప్రధానాంశాలు

Published : 23/11/2020 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాదల్‌కు షాక్‌

ఫైనల్లో మెద్వెదెవ్‌

లండన్‌: ఏటీపీ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్లో రఫెల్‌ నాదల్‌కు షాక్‌! ఈ స్పెయిన్‌ స్టార్‌కు ఝలక్‌ ఇస్తూ రష్యా కెరటం డానియల్‌ మెద్వెదెవ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో మెద్వెదెవ్‌ 3-6, 7-6 (7/4), 6-3తో నాదల్‌పై విజయం గెలిచి డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)తో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ చేజార్చుకున్నాక మెద్వెదెవ్‌ గొప్పగా పోరాడాడు. తొలి సెట్లో అతడు మెరుగ్గానే ఆడినా.. ఎనిమిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన  రఫా 5-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సర్వీస్‌ నిలబెట్టుకుని 6-3తో సెట్‌ గెలిచాడు. రెండో సెట్లో మెద్వెదెవ్‌ పుంజుకున్నాడు. ఒక దశలో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రఫా కూడా దీటుగా స్పందించడంతో ఈ సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో సత్తా చాటిన మెద్వెదెవ్‌ (7/4)తో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో రష్యా కుర్రాడిని రఫా ఆపలేకపోయాడు. ఈ సెట్లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన మెద్వెదెవ్‌ 6-3తో సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచి తొలిసారి ఈ టోర్నీలో తుది సమరానికి అర్హత సాధించాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.