close

ప్రధానాంశాలు

Published : 08/03/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సింధు మళ్లీ..

స్విస్‌ ఓపెన్‌ ఫైనల్లో మారీన్‌ చేతిలో చిత్తు

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పి.వి.సింధు పోరాటం ముగిసింది. అద్వితీయమైన ఆటతీరుతో టైటిల్‌పై ఆశలు రేపిన సింధు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తనపై తిరుగులేని రికార్డున్న స్పెయిన్‌ స్టార్‌ కరోలినా మారీన్‌కు మరోసారి సింధు తలవంచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సింధు 12-21, 5-21తో టాప్‌ సీడ్‌ మారీన్‌ చేతిలో చిత్తుగా ఓడింది. 35 నిమిషాల పోరులో ఆధిపత్యమంతా ప్రత్యర్థిదే. తొలి గేమ్‌లో 6-4తో  ఆధిక్యంలో నిలిచిన సింధును వరుసగా అయిదు పాయింట్లతో వెనక్కి నెట్టింది మారీన్‌. అక్కడ్నుంచి ఆటంతా ఆమెదే.   15-10తో మరింత ముందంజ వేసిన మారీన్‌ వెనుదిరిగి చూడలేదు. 21-12తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ మరింత ఏకపక్షమైంది. మ్యాచ్‌పై ముందే ఆశలు వదులుకున్నట్లు కనిపించిన సింధు అసలు పోటీనే ఇవ్వలేదు. 11-2తో ఆధిక్యంలో నిలిచిన మారీన్‌.. 21-5తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సింధుపై తన గెలుపోటముల రికార్డును ఆమె 9-5తో మరింత మెరుగుపరుచుకుంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన