పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన కూడా రద్దు
Array ( ) 1

ప్రధానాంశాలు

Published : 21/09/2021 03:34 IST

పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన కూడా రద్దు

లండన్‌: పాకిస్థాన్‌కు మరో షాక్‌! ఇంగ్లాండ్‌ కూడా న్యూజిలాండ్‌లో బాటలో పయనించింది. భద్రత కారణాలతో పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకుంది. ఇంగ్లాండ్‌ పురుషులు, మహిళల జట్లు వచ్చే నెలలో పాక్‌లో పర్యటించాల్సివుంది. ‘‘పాకిస్థాన్‌ పర్యటనపై ఈసీబీ లోతుగా చర్చించింది. పురుషులు, మహిళల జట్లను పర్యటనకు పంపరాదని నిర్ణయించింది. క్రీడాకారులు, సహాయ సిబ్బంది మానసిక, శారీరక క్షేమం అన్నింటికంటే ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ముఖ్యం’’ అని ఈసీబీ ఓ ప్రకటనలో చెప్పింది.  షెడ్యూలు ప్రకారం ఇంగ్లాండ్‌ పురుషుల జట్టు అక్టోబరు 13, 14వ తేదీల్లో పాక్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఇంగ్లాండ్‌ మహిళల జట్టు రెండు టీ20లు, మూడు వన్డేల్లో  పోటీపడాల్సింది. తొలి వన్డేకు కొన్ని నిమిషాల ముందు.. న్యూజిలాండ్‌ జట్టు పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన