close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయికే ఆ అవకాశం ఉంది: మైఖేల్‌ వాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఆదరించే ఐపీఎల్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సారి మునుపెన్నడూ లేనివిధంగా ఆరు తటస్థ వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. మ్యాచ్‌ల నిర్వహణ కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.  

జట్టు నిండా మ్యాచ్‌ విన్నర్లు ఉండి గత రెండు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈ సారి కూడా ఐపీఎల్‌ విజేతగా నిలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ జోస్యం చెప్పారు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఆ జట్టు విఫలమైతే.. డేవిడ్‌ వార్నర్‌ సారథిగా ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని వాన్ ట్వీట్‌ చేశారు.

2020 ఐపీఎల్ ఫైనల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను చేజిక్కించుకున్న ముంబయి ఇండియన్స్‌..ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సారి కూడా విజేతగా నిలిస్తే హ్యాట్రిక్‌ కొట్టినట్లవుతుంది. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా 2012లో ఇలాంటి అవకాశం వచ్చింది. 2010, 2011 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై..2012 ఫైనల్‌లో కోల్‌కతా చేతిలో ఓటమిపాలై హ్యాట్రిక్‌ అవకాశాన్ని చేజార్చుకుంది. 

ఏప్రిల్ 9న చెన్నైలోని ఎం.ఎన్‌.చిదంబరం స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 14 సీజన్‌కు తెరలేవనుంది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన