close
కుల వృత్తిదారుల ఉమ్మడి కార్యాచరణ అవసరం 

తెజస అధ్యక్షుడు కోదండరాం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వృత్తి కులాలకు జరుగుతున్న అన్యాయంపై కుల వృత్తిదారులంతా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. వ్యాపారాలే ప్రధానంగా మారుతున్న తరుణంలో కులసంఘాలే ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. వీవర్స్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘నేతన్నల సమరనాదం’ పేరుతో ఈనెల 24న తలపెట్టిన ‘చŸలో దిల్లీ’ కార్యక్రమానికి సమాయత్తం చేస్తూ మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో చేనేత సంఘాలు, రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ దాసు సురేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఎంత ప్రధానమో వృత్తులను కాపాడుకోవడమూ అంతే అవసరమన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చకు తెద్దామంటే ప్రతిపక్షం లేదు, ఉన్నవారూ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో, ఎవరికి మద్దతిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకోసం సేవ చేయాలన్న నాయకత్వం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. సంఘాల ఐక్యతతోనే ప్రభుత్వానికి సోయి తెస్తాయన్నారు. ఆగస్టులో అన్ని వృత్తికులాలతో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ పాలకులు ఆశ చూపి రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్ప పరిష్కారం చూపరన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చేనేతల పరిస్థితి నేడు అతి దారుణంగా మారిందన్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.