రైలుపై తరలిన ప్రాణవాయువు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైలుపై తరలిన ప్రాణవాయువు

విశాఖ ఉక్కు నుంచి మహారాష్ట్రకు 103 టన్నుల ఆక్సిజన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఉక్కు పరిశ్రమ నుంచి తొలి ఆక్సిజన్‌ రైలు గురువారం మహారాష్ట్రకు వెళ్లింది. కొవిడ్‌ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర నుంచి ఈ రైలు ఏడు ఖాళీ ట్యాంకర్లతో తెల్లవారుజామున 4.30 గంటలకు విశాఖ ఉక్కు పరిశ్రమకు చేరుకుంది. నాలుగు ట్యాంకర్లలో 16 టన్నుల చొప్పున, మూడు ట్యాంకర్లలో 13 టన్నుల చొప్పున మొత్తం 103 టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను నింపి తొలివిడతగా మహారాష్ట్రకు పంపారు. దాదాపు 15 గంటలకు పైగా కొనసాగిన ప్రక్రియను ఉక్కు పరిశ్రమ సీఎండీ పీకే.రథ్‌, వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం శ్రీవాస్తవ పర్యవేక్షించారు. ఆక్సిజన్‌ రైలు ప్రయాణానికి తూర్పు కోస్తారైల్వే గ్రీన్‌ ఛానల్‌ మార్గం కల్పించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని