close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తుంగభద్ర వెనక గుట్టుగా ఎత్తిపోతల

అనుమతి లేకుండా 5 టీఎంసీల వినియోగం
సంయుక్త కమిటీ విచారణలో వెల్లడి

ఈనాడు హైదరాబాద్‌: తుంగభద్ర ప్రాజెక్టు వెనక భాగంలో అనధికారిక ఎత్తిపోతల పథకాలతో కర్ణాటక అదనంగా నీటిని వాడుకొంటున్నట్లు తేలింది. కేటాయించిన వాటా కంటే 5 టీఎంసీలకు పైగా జలాలను ఆ రాష్ట్రం వినియోగిస్తున్నట్లు తేటతెల్లమైంది. తుంగభద్ర బోర్డు నియమించిన సంయుక్త కమిటీ విచారణలో ఈ వాస్తవం వెల్లడైంది. దీనిపై ఈ నెలలో జరగనున్న బోర్డు సమావేశంలో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. తుంగభద్ర ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తీసుకొనేలా అనేక ఎత్తిపోతల, తాగునీటి పథకాలు ఉన్నాయి. మోటార్లను అమర్చి పరిశ్రమలకూ జలాలను వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పథకాల్లో అసలు అనుమతి ఉన్నవి ఎన్ని, లేనివి ఎన్ని, అదనంగా ఎంత నీటిని వినియోగిస్తున్నారు.. వంటి అంశాలను తేల్చడానికి తుంగభద్ర బోర్డుతో పాటు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన ఇంజినీర్లతో సంయుక్త కమిటీని ఏర్పాటుచేశారు. అది తుంగభద్రకు కుడి, ఎడమ భాగాల్లో వినియోగంలో ఉన్న 38 ఎత్తిపోతల పథకాలు, నిరుపయోగంగా ఉన్న ఎనిమిది, రెండువైపులా నిర్మాణంలో ఉన్న మరో నాలుగు ఎత్తిపోతల పథకాలను పరిశీలించింది. నిర్మాణంలో ఉన్న పావగడ తాగునీటి పథకానికి 2.34 టీఎంసీలు అవసరం కాగా, దీనికి బోర్డు అనుమతి ఇచ్చింది. పాత ఎత్తిపోతల పథకాలకు 2 టీఎంసీలకు అనుమతి ఉండగా, మరో 3.710 టీఎంసీలను వినియోగిస్తున్నారు. 3.335 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు అనుమతి లేదు. మొత్తంగా 5.045 టీఎంసీల జలాలను వినియోగించుకొనేలా కర్ణాటక అనుమతి లేకుండానే ఎత్తిపోతల పథకాలు చేపట్టినట్లుకమిటీ గుర్తించింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు