వ్యవసాయ పట్టభద్రులకు ఆగ్రోస్‌లో ఉపాధి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యవసాయ పట్టభద్రులకు ఆగ్రోస్‌లో ఉపాధి

మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆగ్రోస్‌ సేవా కేంద్రాలు, భూసార పరీక్ష కేంద్రాల్లో వ్యవసాయ పట్టభద్రులకు ఉపాధి కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. నాబార్డు సహకారంతో ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి కేంద్రం’(ఆగ్రోస్‌) ప్రధాన కార్యాలయాన్ని అమీర్‌పేట నుంచి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఉద్యాన కమిషనరేటు భవన సముదాయంలోకి మార్చి మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు వంటివన్నీ ఒకే గొడుగు కింద ఆగ్రోస్‌ సేవాకేంద్రాల్లో అందేలా చూస్తామన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్‌ బదులు మట్టిలో కలసిపోయే బయోడిగ్రేడబుల్‌ సంచుల పంపిణీకి ఈ సంస్థ చర్యలు చేపట్టిందని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. ఆగ్రోకర్షక్‌ పేరుతో పెట్రోలు బంకులు ఏర్పాటుచేసి నాణ్యమైన పెట్రోలు, డీజిల్‌ అమ్మేలా చూస్తామని ఆగ్రోస్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ కె.రాములు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని