రాత్రి 11 గంటలకు ఎక్కాల్సిన రైలు కోసం ఉదయం 10లోపే స్టేషన్‌కు..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాత్రి 11 గంటలకు ఎక్కాల్సిన రైలు కోసం ఉదయం 10లోపే స్టేషన్‌కు..

లాక్‌డౌన్‌ ఆంక్షలు రైలు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రయాణాలు, ఇతర అవసరాలకు సడలింపు ఇచ్చింది. అయితే, ఈ సమయం తరవాత బయలుదేరే రైళ్లను అందుకోవడం ప్రయాణికులకు ఓ పరీక్షగా మారుతోంది. నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి హజరత్‌ నిజామొద్దీన్‌(దక్షిణ్‌) ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందే అధికారులు ప్లాట్‌ఫాం వద్దకు అనుమతిస్తున్నారు. దీంతో ఈ రైలులో ప్రయాణించాల్సిన వారు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, వర్షాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అధికారులు ఆదివారం నుంచి ముందుగానే అనుమతిస్తున్నారు. అయినా.. ఉదయం 10 గంటల తరవాత రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి రవాణా సదుపాయం లేదు. ఈ కారణంగా ప్రయాణికులు.. రాత్రి 11 గంటలకు వచ్చే హజరత్‌ నిజామొద్దీన్‌(దక్షిణ్‌) ఎక్స్‌ప్రెస్‌ కోసం ఆదివారం ఉదయం 10 గంటలలోపే ప్లాట్‌ఫాంల వద్దకు చేరుకున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు సుమారు 13 గంటలపాటు రైలు కోసం నిరీక్షిస్తూ ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు