హరిత భవనాల జాబితాలో నూతన సచివాలయం
close

ప్రధానాంశాలు

హరిత భవనాల జాబితాలో నూతన సచివాలయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవన సముదాయం జాతీయ హరిత భవనాల జాబితాలో చేరింది. దీనిపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డంగ్‌ కౌన్సిల్‌ వెల్లడించిందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో చేపట్టే నిర్మాణాల్లో పర్యావరణానికి పెద్దపీట వేస్తున్నాం. సచివాలయ నిర్మాణంలో అనుసరిస్తున్న హరిత విధానాలతో 30 నుంచి 50 శాతం వరకు విద్యుత్తును ఆదా చేయనున్నాం. 20 నుంచి 30 శాతం నీటిని పొదుపు చేసేలా ప్రణాళిక రూపొందించాం. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ భవన సముదాయం సొంతం. నిర్మాణంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, జిల్లాల్లో చేపట్టిన కలెక్టరేట్లు తదితరాలనూ హరిత భవనాలుగానే నిర్మిస్తున్నాం’’ అని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని